కె.కందులవారిపల్లిలో మాతమ్మ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
రిపోర్టర్: k. siva prasad
స్థలం: చిట్వేల్
చిట్వేలు మండలం కె.కందులవారిపల్లి బాలాజీనగర్లో శ్రీ మాతమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఎండోమెంట్ శాఖ నిధులతో చేపట్టనున్న ఈ ఆలయ నిర్మాణానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పునాది రాయి వేశారు.
ఎన్నో ఏళ్లుగా గ్రామస్థుల ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న ఈ ఆలయాన్ని మెరుగైన వసతులతో నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం త్వరితగతిన పూర్తై భక్తులకు అందుబాటులోకి రావాలని ముక్కా వరలక్ష్మి ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామస్థులు, ఎన్డీఏ కూటమి నాయకులు, భక్తులు పాల్గొన్నారు.