డీప్ఫేక్ సమస్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన చిరంజీవి, రామ్ చరణ్

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ సాంకేతికతల దుర్వినియోగంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సోమవారం హైదరాబాద్ లో ఫిర్యాదు చేశారని ప్రముఖులు తెలిపారు. ఈ సందర్భంగా కళాకారులకు తగిన రక్షణ కల్పించాలని, కఠిన శిక్షలు అమలు చేయాలని వారు కోరగా, లిఖితపూర్వక వినతిపత్రం ఇవ్వాలని అమిత్ షా సూచించారని, ఈ వ్యవహార సమన్వయ బాధ్యతలను జి. కిషన్ రెడ్డికి అప్పగించారని వారు పేర్కొన్నారు.