ప్రశ్నించే తత్వమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భుయాన్
రిపోర్టర్: శివ
స్థలం: New Delhi
ప్రశ్నించడానికి భయపడే సమాజం నిరంకుశత్వానికి తలవంచాల్సి వస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భుయాన్ స్పష్టం చేశారు. మేఘాలయలోని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ, దేశ ఐక్యతను కాపాడుకోవడానికి పౌరులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో 'మనమంతా ఒక్కటే' అనే భావనను పెంపొందించడం ద్వారానే బలమైన, సమ్మిళిత భారత దేశాన్ని నిర్మించడం సాధ్యమవుతుందని జస్టిస్ ఉజ్వల్ భుయాన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.