ఆంధ్రప్రదేశ్లో అల్పపీడనం ప్రభావం - పలుచోట్ల భారీ వర్షాలు
రిపోర్టర్: మహేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తరాంధ్ర మరియు కోస్తా తీర ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. విజయవాడలో కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.