బోనాల సందడితో మార్మోగిన లింగారెడ్డిగూడెం
చౌటుప్పల్: పురపాలిక పరిధిలోని లింగారెడ్డిగూడెం 1వ వార్డులో శ్రీ ముత్యాలమ్మ, మర్ల మైసమ్మ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవార్లను ఊరేగించారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా స్థానిక వార్డు కౌన్సిలర్ కోసనం రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు. అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలపై అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.
కార్యక్రమంలో సుర్కంటి వెంకట్ రెడ్డి, బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్ల పర్వతాలు యాదవ్, యు రమేష్ గౌడ్, బి మల్లారెడ్డి, ఎస్ యాదిరెడ్డి, ముప్పిడి పాండుగౌడ్, ఎస్ భగవంతు రెడ్డి, బి శ్రీనివాస్ రెడ్డి, టి లింగస్వామి గౌడ్, టి మల్లేష్ గౌడ్, మధు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.