మధ్యవర్తిత్వంతో సత్వర న్యాయం: విజయనగరంలో మీడియేటర్స్ న్యాయవాదులకు ప్రత్యేక వర్క్షాప్

రిపోర్టర్: శివ స్థలం: విజయనగరం

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా న్యాయస్థానంలో మధ్యవర్తిత్వంపై శిక్షణ పొందిన న్యాయవాదులకు ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత వెల్లడించారు. ఈ బృహత్తర కార్యక్రమం దేశవ్యాప్తంగా తొంబై రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ మధ్యవర్తిత్వ ప్రాముఖ్యతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కోరారు. ఈ ప్రక్రియ ఎంతో సులువైనదని, ఎలాంటి ఖర్చు లేకుండా సత్వర పరిష్కారం లభిస్తుందని ఆమె స్పష్టం చేశారు.