రాష్ట్రంలో కొత్తగా ఆరు నగరవనాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
రిపోర్టర్: సతీష్
స్థలం: మంగళగిరి
ప్రకృతి సంపదను కాపాడుతూ బాధ్యతాయుతమైన ఎకో టూరిజంను అభివృద్ధి చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి ఆరు నూతన నగరవనాలను ఆయన వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఇరవై ఐదు నగర వనాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎకో టూరిజం ద్వారా గిరిజనులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు.