డర్బన్ టెస్ట్: విజయానికి చేరువలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ముందు భారీ లక్ష్యం

రిపోర్టర్: సునీల్ స్థలం: Durban

డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం దిశగా దూసుకుపోతోందని క్రీడా వర్గాలు వెల్లడించాయి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసిందని, ఆఖరి రోజు విజయం సాధించాలంటే ఇంకా 319 పరుగులు చేయాల్సి ఉందని తెలిపారు. తొలుత రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 314 పరుగుల వద్ద డిక్లేర్ చేసి, ప్రత్యర్థి ముందు 421 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచినట్లు పేర్కొన్నారు.