ట్రెండింగ్‌లో ఐ హేట్ మ్యారేజ్ సినిమా టీజర్: ఆకట్టుకుంటున్న సుగి విజయ్
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
సుగి విజయ్ మరియు జుప్సీ భద్ర హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఐ హేట్ మ్యారేజ్ చిత్ర టీజర్ విడుదలైనట్లు దర్శకుడు పరమేశ్ రేణుకుంట్ల తెలిపారు. ప్రేమ, పెళ్లి, కెరీర్‌పై నేటి తరం ఆలోచనలను వాస్తవానికి దగ్గరగా ఈ చిత్రంలో చూపించామని ఆయన వెల్లడించారు. ఆర్య సినిమా బ్యానర్‌పై మాదం దయానంద్, కార్తిక్ వెంపటి ఈ చిత్రాన్ని నిర్మించారని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ స్పష్టం చేశారు.