వైఎస్ జగన్ అవినీతి రికార్డులపై మంత్రి సత్యకుమార్ తీవ్ర విమర్శలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: గుంటూరు

దేశంలోనే అత్యధికంగా సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్.. పారదర్శకత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, డీఎస్సీ క్రీడాకోటా నియామకాలపై అక్రమ దుష్ప్రచారం చేయడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందని మండిపడ్డారు.