నెల్లూరులో ఘనంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అభివృద్ధి పనుల శంకుస్థాపన

రిపోర్టర్: సురేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు మైపాడు గేట్ సెంటర్‌లోని డీజీపీ కల్యాణ మండపంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద రూ. 380 కోట్ల అంచనా వ్యయంతో 62 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కుప్పం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, విశాఖపట్నం నుంచి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రత్యేక సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేయర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.