నవంబరులో నేరడి బ్యారేజీ శంకుస్థాపనకు జలవనరుల శాఖ ఏర్పాట్లు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమరావతి

ఉత్తరాంధ్రకు అత్యంత ప్రయోజనకరమైన నేరడి బ్యారేజీ నిర్మాణానికి నవంబరు నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రూ.641.10 కోట్ల అంచనాలతో పరిపాలనా మోదం పొందిన ఈ ప్రాజెక్టు తాజా డిజైన్లతో రూ.1,099.87 కోట్లకు చేరింది. బ్యారేజీ నిర్మాణం పూర్తయితే మొదటి దశలో 1,48,000 ఎకరాలకు, రెండో దశలో 1,07,280 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఒడిశా భూభాగంలో అవసరమైన 106 ఎకరాల భూసేకరణ కోసం ఆ రాష్ట్ర అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయి.