నవీ ముంబైలో ఘోరం: నకిలీ నంబరు ప్లేటుతో థార్ కారు వీరంగం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Navi Mumbai

మహిళలపై వేధింపులకు పాల్పడి, మరో వ్యక్తిని ఢీకొట్టిన నిందితుడిని నవీ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పది గంటల్లోనే అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఖర్ఘర్ ప్రాంతంలో ఎర్రటి థార్ వాహనంతో నకిలీ నంబరు ప్లేటు అమర్చి ఈ అరాచకానికి పాల్పడిన అలీ అలియాస్ తాలిబ్ అహ్సన్ నఖ్వీని అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా సాంకేతికతను ఉపయోగించి దర్యాప్తు చేపట్టి నిందితుడిని ఖర్ఘర్ పోలీసులకు అప్పగించినట్లు అధికారులు స్పష్టం చేశారు.