సీతారాంపురం గ్రామ పంచాయతీలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: గుండాల

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామ పంచాయతీ ఆవరణలో శనివారం రోజు చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన వీర వనిత స్ఫూర్తిని కొనియాడుతూ ఆమె చిత్రపటానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు వీరనారి ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.