2029 నాటికి ప్రతి పేదవాడికి శాశ్వత ఇల్లు అందిస్తాం

రిపోర్టర్: అశోక్ స్థలం: ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి 2029 నాటికి సురక్షితమైన గృహం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన సమీక్షలో 2027 మార్చి నాటికి 5.52 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పీఎం ఆవాస్ యోజన కింద మంజూరైన ఇళ్ల పనులను వేగవంతం చేసి, పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని స్పష్టం చేశారు.