అసెంబ్లీలో గుండెపోటుతో సచివాలయ ఉద్యోగి మృతి
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో విధి నిర్వహణలో ఉన్న సచివాలయ ఉద్యోగి రాజు ఆకస్మికంగా కుప్పకూలి మృతి చెందారు. ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ పీఎస్‌గా పనిచేస్తున్న ఆయనకు మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఉద్యోగి అకాల మరణం పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.