నెల్లూరు జిల్లాలో నిత్యావసరాలు, ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయన్న కలెక్టర్

రిపోర్టర్: వెంకట్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్లతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే నిత్యావసరాల నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా వెల్లడించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, వదంతులను నమ్మి అధిక మొత్తంలో కొనుగోళ్లు చేయవద్దని స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టించినా లేదా నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయించినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తీవ్రంగా హెచ్చరించారు.