విశాఖలో జరిగే అఖిల భారత సాహిత్య సమ్మేళన పోస్టర్ ఆవిష్కరణ

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

అక్టోబరు 10, 11 తేదీలలో విశాఖపట్నం డాబా గార్డెన్స్లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న సాహిత్య సమ్మేళన పోస్టర్ను శనివారం నర్సీపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, సాహిత్య అభిమానులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఔత్సాహిక యువ కవులు, సాహితీవేత్తలు పెద్ద ఎత్తున హాజరుకావాలని సమ్మేళన బాధ్యులు కె.త్రిమూర్తులు రెడ్డి కోరారు.