అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే చీర లాగిన పోలీసులు
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ అసెంబ్లీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించి చీర లాగారని గులాబీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీశ్ రావు సహా పలువురు నేతలను బలవంతంగా అరెస్ట్ చేశారు. ఇది యావత్ తెలంగాణ మహిళలపై జరిగిన అవమానమని బీఆర్ఎస్ మండిపడింది.