రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో మెుత్తం ఇరవై ఎనిమిది జిల్లా పరిషత్ ఛైర్మన్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు పంచాయతీరాజ్ కమిషనర్ మైలవరపు తేజ వెల్లడించారు. తిరుపతి, గుంటూరు, కోనసీమ స్థానాలు ఎస్సీ మహిళలకు కేటాయించగా, ఎన్టీఆర్, ప్రకాశం ఎస్సీ జనరల్కు దక్కాయి. అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం బీసీ మహిళలకు, విశాఖ, అనంతపురం, కర్నూలు బీసీ జనరల్కు కేటాయించినట్లు అధికారులు స్పష్టం చేశారు.