ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులకు ఎమ్మెల్యే రామకృష్ణ దిశానిర్దేశం
రిపోర్టర్: అశోక్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్వయంగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, వాటిని అత్యంత త్వరగా పరిష్కరించే దిశగా తగు సూచనలు చేస్తూ అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి జాప్యం ఉండకూడదని, బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు కురుగొండ్ల రామ కృష్ణ వెల్లడించారు.