దేశవ్యాప్తంగా ఆరు స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం: ఉత్కంఠ

రిపోర్టర్: వెంకట్ స్థలం: New Delhi

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ మరియు లోక్సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. వివిధ కారణాలతో ఖాళీ అయిన ఈ స్థానాలకు రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించి తీవ్రంగా ప్రచారం నిర్వహించాయి. ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖ అభ్య్రధుల భవితవ్యం తేలనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓటర్లు తమ హక్కును వినియోగించుకుంటున్నారు.