ఇరుముడి సినిమా విజయంలో తాటిపాక కృష్ణస్వామి కీలక పాత్ర

రిపోర్టర్: కిరణ్ స్థలం: తూర్పు గోదావరి

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'ఇరుముడి'. ఈ సినిమాలో అయ్యప్ప స్వామి మాలధారణ, పడి పూజలు తదితర సాంప్రదాయ విషయాలను సహజసిద్ధంగా చూపించడంలో ప్రముఖ గురుస్వామి తాటిపాక కృష్ణస్వామి చిత్ర బృందానికి ఎంతో మార్గదర్శనం చేశారని దర్శకుడు తెలిపారు. 41 సార్లు అయ్యప్ప మాలధారణ చేసిన కృష్ణస్వామి సహకారంతోనే ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని పేర్కొన్నారు.