విజయవాడ లాడ్జిలో పాత నేరస్థుడి హత్య కేసులో నిందితుల అరెస్ట్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: NTR District
విజయవాడ సత్యనారాయణపురం లాడ్జిలో జరిగిన హత్య కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో స్నేహితుడి భార్యను అసభ్యంగా దూషించడంతో ఆగ్రహానికి గురైన మిత్రులు పాండిదురైని కత్తితో పొడిచి హతమార్చారు. అనంతరం వివిధ ప్రాంతాలకు పరారైన నిందితులను సాంకేతిక ఆధారాలతో గుంటూరు జిల్లా తాడేపల్లిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు, నిందితులు అందరూ తమిళనాడుకు చెందిన పాత నేరస్థులే కావడం గమనార్హం.