తాగునీటి కోసం కాకినాడ జిల్లా గొల్లప్రోలు కాలనీ వాసుల అవస్థలు

రిపోర్టర్: గోపి స్థలం: కాకినాడ

కాకినాడ జిల్లా గొల్లప్రోలు జగనన్న కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. సుమారు వెయ్యి కుటుంబాలు నివసించే ఈ కాలనీలో నీరు ఉప్పగా ఉండటంతో పంచాయతీ ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. స్థానికంగా చేపట్టిన రక్షిత మంచినీటి ట్యాంకు నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు పూర్తి చేసి తాగునీటి వెతలు తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.