ఆధ్యాత్మిక శోభతో పులకించిన రాంనగర్ వినాయక మండపాలు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంనగర్ లోని వినాయక మండపం వద్ద మహిళలతో వేద పండితులు మాసం రాజన్న సామూహిక కుంకుమ పూజలు శుక్రవారం నాడు నిర్వహించారు. తమ కుటుంబాలు దేశం బాగుండాలని కోరుకుంటూ మహిళలు గణనాథుని పూజలు చేశారు. దీంతో రాంనగర్ లో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది.