నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఎస్బీఐ పీవో మెయిన్స్ ఫలితాలు విడుదల

రిపోర్టర్: సునీల్ స్థలం: న్యూఢిల్లీ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీవో మెయిన్స్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాలను పరిశీలించుకోవచ్చని వారు పేర్కొన్నారు. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం పదిహేను వందల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలో తదుపరి దశ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం అందించారు.