మసూద్ అజర్‌పై పాకిస్థాన్ జిమ్మిక్కులను ఖండించిన భారత్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: India
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌పై పాకిస్థాన్ రివార్డ్ ప్రకటించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇవి కేవలం జిమ్మిక్కులు మాత్రమేనని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ప్రకటనలు చేయడం కాకుండా, కఠినమైన చర్యలు తీసుకోవాలని పాక్‌ను డిమాండ్ చేసింది. కేవలం బూటకపు ప్రకటనలతో అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించలేరని స్పష్టం చేసింది.