జన్నారంలో విద్యుత్ కోతలు ఆపకపోతే సబ్ స్టేషన్ ముట్టడిస్తామన్న బీఆర్ఎస్

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రం రాజారాంరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవి రాకముందే కోతలు విధిస్తున్నారని విమర్శించారు. వారంలోగా సమస్య పరిష్కరించకపోతే సబ్ స్టేషన్ ముట్టడిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.