నేలకొండపల్లిలో దుర్గామాత నిమజ్జన ఊరేగింపులో డీజేలు నిషేధమని హెచ్చరిక

రిపోర్టర్: kasanivenkatesh స్థలం: నేలకొండపల్లి

నేలకొండపల్లి మండలంలో దుర్గామాత నిమజ్జన ఊరేగింపులో ఎవరూ డీజేలు పెట్టరాదని ఎస్సై పి.శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. డీజేల భారీ శబ్ద తీవ్రతతో ప్రజలకు, వృద్ధులకు తీవ్ర హాని కలుగుతుందని హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే ఉత్సవ కమిటీ సభ్యులు, డీజే యజమానులు, ఆపరేటర్లపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రశాంతంగా నిమజ్జనం పూర్తి చేయాలని కోరారు.