నార్సింగిలో చెడ్డి గ్యాంగ్ హల్చల్ కలకలం రేపింది

రిపోర్టర్: భాస్కర్ స్థలం: గండిపేట

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని నెక్నాంపూర్ డివిజన్లో చెడ్డి గ్యాంగ్ కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున ఫ్లోటిల్లా అపార్ట్మెంట్స్లోకి ఆరుగురు అనుమానితులు ప్రవేశించి చోరీకి యత్నించినట్లు స్థానికులు తెలిపారు. అడ్డుబోయిన వారిపై ఆయుధాలతో దాడికి తెగబడ్డారని పేర్కొన్నారు. సీసీటీవీ దృశ్యాలు వైరల్ కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రివేళల్లో పోలీసు గస్తీని పెంచాలని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.