గోల్డెన్ స్టేట్ వారియర్స్‌లోనే నా కెరీర్ ముగిస్తా: స్టీఫెన్ కర్రీ
రిపోర్టర్: గోపి
స్థలం: United States
తమ కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు స్టార్ బాస్కెట్‌బాల్ ఆటగాడు స్టీఫెన్ కర్రీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మోకాలి గాయం కారణంగా గత సీజన్‌లో ఇబ్బంది పడినప్పటికీ, రాబోయే సీజన్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. తన కెరీర్ ముగిసేవరకు గోల్డెన్ స్టేట్ వారియర్స్‌లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. కర్రీ రాబోయే సీజన్‌లో అద్భుతాలు సృష్టిస్తాడని అతని భార్య అయేషా కర్రీ ధీమా వ్యక్తం చేశారు.