'నిరుద్యోగుల జీవితాలు నాశనం': గ్రూప్-1 ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్‌పై టిడిపి ఫైర్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Amaravati

వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 పరీక్షల్లో 97.55 శాతం ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్ జరిగిందని సిట్ నివేదిక బట్టబయలు చేసిందని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా మండిపడింది. అర్హులైన ప్రతిభావంతులైన అభ్యర్థుల భవిష్యత్తును జగన్ సర్కార్ దారుణంగా నాశనం చేసిందని, వైటర్ల వాడకం, జవాబు పత్రాల దాచిపెట్టడం వంటి అక్రమాల ద్వారా రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించారని మండిపడుతూ నిరుద్యోగులకు జరిగిన తీవ్ర అన్యాయంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.