స్థానిక సమరానికి కూటమి నేతల కార్యాచరణ శంఖారావం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఎచ్చెర్ల

శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం కూటమి జిల్లా సమన్వయ కమిటీ తొలి సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి ఎచ్చెర్ల ఎమ్మెల్యేతో పాటు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, అలాగే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల భారీ గెలుపే లక్ష్యంగా అందరూ ఐక్యంగా సమన్వయంతో ముందుకు సాగాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని నేతలు పిలుపునిచ్చారు.