రైతులకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

పంటకు గిట్టుబాటు ధర లేక నష్టపోయే రైతులకు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని అండగా నిలుస్తోందని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వైకాపా హయాంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ పేరుతో ప్రచారం తప్ప ప్రయోజనం దక్కలేదన్నారు. కూటమి ప్రభుత్వం ధరల రక్షణ కోసం భారీగా నిధులు ఖర్చు చేసి రైతులకు బాసటగా నిలిచిందని తెలిపారు.