'తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమ': సింగపూర్ ప్రతినిధి బృందం వెల్లడి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు చేయడానికి సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. సింగపూర్ పర్మనెంట్ సెక్రెటరీ ఆగస్టీన్ లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ విషయాన్ని వెల్లడించినట్లు Telangana CMO తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధిపై ఇరువర్గాల మధ్య కీలక చర్చలు జరిగాయని, దీని ద్వారా రాష్ట్రంలో హైటెక్ పరిశ్రమలు విస్తరించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.