'రికార్డు స్థాయిలో ఐపీఓ..': నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సంచలనం

రిపోర్టర్: సునీల్ స్థలం: భారతదేశం

దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ఈరోజు ప్రారంభమైంది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ. 22,561.57 కోట్ల నిధులను సేకరించడమే లక్ష్యంగా ఈ ఐపీఓ ముందుకు వెళ్తోంది. ఈ ఇష్యూ ధరల శ్రేణిని రూ. 1,700 నుండి రూ. 1,785 వరకు నిర్ణయించగా, సెప్టెంబర్ 21 వరకు బిడ్డింగ్ అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ. 6,746.2 కోట్లను ఎన్‌ఎస్‌ఈ సమీకరించింది.