మర్చంట్ నేవీ ఆఫీసర్ హత్య కేసు: దోషులకు మీరట్ కోర్టు మరణశిక్ష
రిపోర్టర్: నరేష్
స్థలం: మీరట్
మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో దోషులు ముస్కాన్ రస్తోగి, సా శుక్లాలకు మీరట్ కోర్టు మరణశిక్ష ఖరారు చేసిందని అడ్వకేట్ క్రిషన్ కుమార్ దుబే తెలిపారు. ప్రేమ వివాహం చేసుకున్న భర్తను అతి కిరాతకంగా నరికి డ్రమ్‌లో దాచిన ఈ ఉన్మాద ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని, బలమైన సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయస్థానం ఈ చరిత్రాత్మక తీర్పు వెలువరించిందని ఆయన పేర్కొన్నారు.