ఫలక్ నుమా ప్యాలెస్లో రక్ష ఎక్స్ పో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఉత్తమ్
రిపోర్టర్: నరేష్
స్థలం: సూర్యాపేట
హైదరాబాద్లోని చారిత్రాత్మక ఫలక్ నుమా ప్యాలెస్లో జరగనున్న రక్ష ఎక్స్ పో కర్టెన్ రైసర్ నెట్వర్కింగ్ మీటింగ్ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సమావేశ ఏర్పాట్లపై అధికారులతో చర్చించి పలు కీలక సూచనలు చేశారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. వేడుక నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు.