తీరానికి మురసు తుపాను ముప్పు: ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
రిపోర్టర్: హరి
స్థలం: అమరావతి
బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు - నరసాపురం మధ్య తుపాను తీరాన్ని దాటే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.