విద్యా సంస్థల్లో బాలల రక్షణ అత్యంత కీలకమన్న డాక్టర్ కృష్ణ ప్రసాద్

రిపోర్టర్: గోపి స్థలం: విజయనగరం

అయ్యన్నపేట శ్రీ వెంకటేశ్వర ఏఐఏటీ జూనియర్ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాలల రక్షణ అంశంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎ. కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ విద్యా సంస్థల్లో బాలలకు సురక్షితమైన వాతావరణం కల్పించడంలో ఉపాధ్యాయులు, లెక్చరర్లు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. బాలలపై జరిగే హింస, వేధింపులు, పోక్సో చట్టంపై ఉపాధ్యాయులు అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు.