మహబూబ్ నగర్ లో దారుణం: భూ వివాదం నేపథ్యంలో కోడలి దారుణ హత్య

రిపోర్టర్: శివ స్థలం: Mahbubnagar

మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం చింతల్ తండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూ వివాదం కారణంగా సునీత అనే ఇరవై ఎనిమిదేళ్ల వివాహితను ఆమె మామ, బావలు కలిసి అతి కిరాతకంగా హతమార్చారని ఎస్ఐ నాగరాజు వెల్లడించారు. సునీత పేరు మీద ఉన్న ఒకటిన్నర ఎకరాల భూమిని లాక్కునేందుకు నిందితులు చాలాకాలంగా వేధింపులకు గురిచేస్తున్నారని, సోమవారం మధ్యాహ్నం ఆమెను అడ్డగించి ఇంట్లోకి ఈడ్చుకెళ్లి గొంతు కోసి చంపేశారని పోలీసులు తెలిపారు.