మురసు తుపాను ఉదృతి: సీఎం చంద్రబాబుతో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

మురసు తుపాను ప్రభావంపై సీఎం చంద్రబాబు నాయుడికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారని అధికారులు తెలిపారు. ఒంగోలు వద్ద తీరం దాటిన తుపాను కారణంగా రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని, జిల్లాల్ లో జరిగిన పంట, ఆస్తి నష్టాన్ని సీఎం వివరించారు. ఈ క్రమంలో ఏపీకి తగిన ఆర్థిక సహాయం అందిస్తామని, కేంద్రం ఎప్పుడూ అండగా ఉంటుందని అమిత్ షా హామీ ఇచ్చారని అధికారులు వెల్లడించారు.