అడవి పందుల దాడితో పూర్తిగా ధ్వంసమైన పత్తి పంట.. తీవ్ర ఆవేదనలో మన్ననూరు రైతులు

రిపోర్టర్: dumarla bhaskar senier journalist స్థలం: అమ్రాబాద్

అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో అడవి పందులు ప్రతి చేలపై దాడి చేసి పంటను పూర్తిగా ధ్వంసం చేశాయని మన్ననూరు గ్రామానికి చెందిన రైతు ఇస్లావత్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి అందివచ్చిన పత్తి పంట చేలలో అడవి పందుల గుంపు దాడి చేసి దాదాపు నాలుగు లక్షల వరకు పంట నష్టం చేశాయని తెలిపారు. అటవీశాఖ ఉన్నతాధికారులు స్పందించి పందుల బెడద నుంచి తమను కాపాడాలని, నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.