ఊట బావుల పనుల్లో అధికారుల నిర్లక్ష్యం, రూ.లక్షలు స్వాహా
రిపోర్టర్: రాము
స్థలం: విజయనగరం
బೊబ్బిలిలోని వేగావతి నది ఊట బావుల కాలువ తవ్వకం పనుల్లో భారీ అవకతవకలు వెలుగుచూశాయి. శాశ్వత పనులు చేపట్టకుండా ఏటా తాత్కాలిక తూతూమంత్రపు పనులతో గుత్తేదారులు, అధికారులు కలిసి రూ.లక్షలు దోచుకుంటున్నారు. గత ఐదేళ్లలో సుమారు రూ.13 లక్షలు ఖర్చు చేసినా పట్టణంలో తాగునీటి కష్టాలు తీరలేదు. నాణ్యత లేని పనులతో నిధులు వృథా అవుతుండగా, ఇసుక మేటలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.