ఆపరేషన్ త్రిశూల్: ఏర్పేడు పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత అవగాహన కార్యక్రమం

రిపోర్టర్: అశోక్ స్థలం: తిరుపతి

తిరుపతి జిల్లా ఏర్పేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొబాక హరిజనవాడలో ఆపరేషన్ త్రిశూల్లో భాగంగా స్థానిక ప్రజలకు పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు Tirupati Police వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నేరాల నియంత్రణ, భద్రతా చర్యలు మరియు అప్రమత్తంగా ఉండాల్సిన తీరుపై ప్రజలకు అధికారులు పలు కీలక సూచనలు చేశారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల రక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.