అనంతపురంలో కాలువలో పడిన ఎద్దుల బండి, రైతు రక్షణ

రిపోర్టర్: వెంకట్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కరకముక్కల వద్ద గుంతకల్లు బ్రాంచ్ కెనాల్‌లో ఎద్దుల బండితో సహా పడిపోయిన రైతు నాగేంద్రను స్థానికులు కాపాడారు. పొలం పని ముగించుకుని వస్తుండగా ఎద్దులు బెదిరి కాలువలోకి దూసుకెళ్లాయి. నీటి ప్రవాహంలో కొట్టుమిట్టాడుతున్న రైతును, ఎద్దులను స్థానికులు అప్రమత్తతతో సురక్షితంగా బయటకు వెలికితీశారు.