గుంటూరు పార్లమెంట్లో ఏడు వందల యాభై కోట్లతో రైల్వే బ్రిడ్జిల నిర్మాణం

రిపోర్టర్: సతీష్ స్థలం: గుంటూరు

గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో ఎనిమిది రైల్వే బ్రిడ్జిలను నిర్మిస్తున్నట్లు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ - కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ వెల్లడించారు. అమరావతి మరియు గుంటూరు భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని, వంద నలభై ఏడు కోట్ల రూపాయలతో నాలుగు లైన్ల రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గుంటూరు పార్లమెంట్ పరిధిలో రైల్వే మౌలిక వసతులను మరింత బలోపేతం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.