జన్నారంలో మహిళల ఆర్థికాభివృద్ధికి ఉచిత హ్యాండ్మేడ్ జ్యువెలరీ శిక్షణ

రిపోర్టర్: gourinatha p.g స్థలం: జన్నారం

మహిళలు స్వయం ఉపాధి సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో జన్నారం మండల కేంద్రంలో హ్యాండ్మేడ్ జ్యువెలరీ తయారీలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు EDII ప్రాజెక్ట్ ఆఫీసర్ భుక్యా దేవేందర్ తెలిపారు. పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వయస్సు మహిళలు ఈ శిక్షణలో పాల్గొని ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు.