ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుది ఓటరు జాబితా విడుదల తేదీ పొడిగింపు

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సవరణ గడువును మరోసారి పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ పదహారవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తుది ఓటరు జాబితాను అధికారికంగా ప్రకటించనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. అక్టోబర్ పదవ తేదీ వరకు ఓటరు జాబితాపై వచ్చే నోటీసులు, అభ్యంతరాలు మరియు క్లెయిమ్లను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.